మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ- ఏపీ విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం…దుర్భాషలాడుకోవడా జరిగింది. ఇద్దరు ఢీ అంటే ఢీ అన్న సందర్భాలు కోకోకల్లలు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇద్దరి మధ్య ఇలాంటి యద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఒకప్పుడు భూమా అనుచరుడే ఏవీ ఇప్పుడు భూమా కుమార్తె అఖిల ప్రియకు భగ్ధ శత్రువయ్యాడు. భూమా మరణం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఏవీ-అఖిల ప్రియ మధ్య అదిపత్య పోరు నడించింది.
ఈ వివాదంలో నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కల్పించుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసిన సఫలం కాలేదు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో అఖిల ప్రియ టీడీపీ నుంచి పోటి చేసి ఓడిపోయిన తర్వాత ఏవీ కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది అనుకున్నారంతా. అయితే అంతకు ముందే ఏవీ సుబ్బారెడ్డిపై ఓ హత్యాప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఎవరు చేసారు అన్నది అప్పుడు సరైన క్లారిటీ లేదు. కడప పోలీసులు రంగంలోకి దిగడంతో సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు. తాజాగా ఇరువురి మధ్య అసలైన వార్ ఇప్పుడే మొదలైనట్లు ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
అఖిల ప్రియపై సుబ్బారెడ్డి సంచనల ఆరోపణలు చేసి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అఖిల్ ప్రియ తనను చంపడానికి హత్యా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అఖిల ప్రియ తన భర్తలో కలిసి ఈ కుట్రను పన్నుతున్నట్లు ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డిని చంపడానికి ఇద్దరికి కోటి రూపాయలు సుపారీగా ఇచ్చినట్లు ఆరోపించారు. రామిరెడ్డి, రవిచంద్రా రెడ్డి అనే ఇద్దరికి చెరో 50 లక్షలిచ్చి మీదకి పంపే ప్ర్రయత్నాలు చేసినట్లు తెలిపారు. వీళ్లిద్దరికీ అఖిల ప్రియ పీఏ డబ్బులిచ్చిచ్చారన్నారు. ఈ కేసులో మొత్తం 5 గురు ముద్దాయిలుగా ఉన్నారన్నారు. అందులో అఖిల ప్రియ ఏ4, ఆమె భర్త భార్గవ్ ఏ 5 గా ఉన్నట్లు తెలిపారు. ఆ రోజు కడప పోలీసులు స్పాట్ కి చేరుకోకపోతే సుబ్బారెడ్డిని చంపసేవారని ఆరోపించారు.