Bhogi pallu: పిల్లలపై వేసిన భోగిపళ్ళను ఏం చేయాలి.. వాటిని తినవచ్చా?

Bhogi Pallu: సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభం అవుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్వకాలం నుంచి భోగి పండుగ రోజు ఇంట్లో పెద్ద వారు చిన్న పిల్లలపై భోగి పళ్ళు వేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే పిల్లలపై వేసిన భోగి పళ్ళను ఆ తర్వాత ఏం చేయాలి అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఈ క్రమంలోనే ఆ భోగి పళ్ళను తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంటాయి. అయితే పిల్లలపై వేసిన భోగి పళ్ళను ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా పిల్లలపై భోగిపళ్ళు వేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.భోగి పళ్ళు పిల్లలపై వేయటం వల్ల వారిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని భావిస్తారు. అలాగే భోగి పళ్ళు నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఇలా నారాయణుడికి ప్రీతికరమైన భోగి పళ్ళు పిల్లలపై వేయటం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పిల్లలపై ఉంటుందని చెప్పవచ్చు.అయితే పిల్లల పై వేసే భోగి పళ్ళు వారికి దిష్టితీసి వేస్తాము కనుక ఆ భోగి పళ్ళ ను తిరిగి తినకూడదు.

సాధారణంగా మనం దిష్టి తీసిన వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా బయట పడేస్తాము. ఈ క్రమంలోనే ఇలా పిల్లల పై వేసిన భోగి పళ్ళను కూడా తినకుండా వాటిని తొక్కకుండా ఒక సంచిలో వేసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. లేదంటే బావిలో పడేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అందుకే పిల్లల పై వేసిన ఈ భోగి పళ్ళను ఎవరు తినకుండా చూసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలు భోగి పళ్ళను అసలు తినకూడదు. అయితే భోగి పళ్ళను సూర్యాస్తమయ సమయంలో వేయడం ఎంతో మంచిది.