KCR Birthday: మనకు తెల్లారిలేస్తే టిఫిన్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ఇడ్లీ, దోశ. అయితే దోశల్లో చాలా వెరైటీలను భోజన ప్రియులు ఇష్టపడుతుంటారు. కారం దోశ, మసాల దోశ, ఉల్లిపాయ దోశ, పన్నీర్ దోశ, ఉప్మా దోశ, 70 ఎంఎం దోశ ఇలా వెరైటీ దోశలు దొరుకుతుంటాయి. అయితే ఈ జాబితాలో గులాబీ దోశ కూడా చేరింది. అది కూడా కేవలం ఒక రూపాయికే ఒక దోశ లభిస్తుండటంతో. దీంతో దోశ లవర్స్ విరగబడి కొంటున్నారు. అయితే ఇది ఎక్కడో తెలుస్తా అసలు.. ఈ దోశకు ఎందుకు అంత స్పెషాలిటీ అంటే ఈ వివరాలు చదవాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గంలో ఈ గులాబీ దోశ దొరుకుతోంది. అసలు ఎందుకు ఈ గులాబీ దొశ చేశారనే కదా మీ సందేహం. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు రూపాయికే గులాబీ దోశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బీట్ రూల్ కలపడంతో ఆ దోెశకు గులాబీ కలర్ వచ్చింది. ఇక కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఒక వినూత్న కార్యక్రమంతో శుభాక్షాంక్షలు తెలపాలనుకున్న కార్యకర్తలు, అభిమానులు ఇలా ఈ గులాబీ దోశకు ప్రారంభించారు.
దీంతో ఈ గులాబీ దోశ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ సార్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వినూత్న కార్యక్రమం చేసిన గులాబీ కార్యకర్తలకు ప్రశంసలు దక్కతున్నాయి. అది కూడా కేవలం ఒకే రూపాయికి దోశను అందిస్తుండటంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే నెటిజెన్లు మాత్రం సరదాగా కామెంట్లు పెడుతున్నారు.