బొజ్జలోని కొవ్వు మాయం చేసే ఆయుర్వేద మార్గాలు

Best tips to burn belly fat as per ayurveda

మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కువమంది అధిక బరువుతో నానా అగచాట్లు పడుతున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పెరిగిన బరువు కోల్పోవడం సులభం కాదు అందులోనూ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించటం మరింత కష్టం. దానికి ఆయుర్వేదం ప్రకారం జీవనశైలిలో కొన్ని సర్దుబాటులతో చెక్ పెట్టొచ్చు. ఇక్కడ పొందుపరిచిన ఎనిమిది సాధారణ చిట్కాలను పాటించి బొజ్జ చుట్టూ ఉన్న కొవ్వుని మాయం చేయండి.

Best tips to burn belly fat as per ayurveda

Tip-1: శరీరానికి కావలసిన రోజువారీ కేలరీలలో 50 శాతాన్ని మధ్యాహ్న భోజన సమయంలోనే లభించే విధంగా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక రాత్రి భోజనంలో తక్కువ కేలరీలు ఉండే విధంగా, అది కూడా 7 గంటలకు ముందుగానే తీసుకునేలా ప్లాన్ చేసుకోండి.

Tip-2: శరీరంలో కొవ్వు పెరగటానికి పిండి పదార్థాలు ఎక్కువ కారణమవుతాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించాలంటే కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. తీపి పానీయాలు, తీపి పదార్థాలు, పాస్తా, రొట్టె, బిస్కెట్లు మరియు నూనెలో వేయించిన ఆహారాలను దూరం పెట్టండి.

Tip-3: ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి పిండిని నీటితో కలిపి తినండి. లేదంటే రాత్రి పడుకునే ముందు కప్పు మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఆ ద్రావణాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Tip-4: గార్సినయా కంబోజియా ఫ్రూట్ (మలబార్ టామరిండ్) ను తింటే… రుచిని పెంచుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Tip-5: ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం ఒక అద్భుతం. ఆహారంలో భాగంగా త్రిఫల చూర్ణం చేర్చితే శరీరంలోని మలినాలను తొలిగించటమేగాక జీర్ణ వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. త్రిఫల చూర్ణం ఒక టీస్పూన్ తీసుకుని వెచ్చని నీటితో
కలుపుకుని నైట్ భోజనం తర్వాత తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది.

Tip-6: శొంఠిలో ఉండే థర్మోజెనిక్ ఏజెంట్లు కొవ్వు కరగడంలో బాగా ఉపయోగపడతాయి. వేడి నీటిలో శొంఠి కలుపుకుని సేవిస్తే జీవక్రియ పెరగడం మరియు అదనపు కొవ్వు కరగడం జరుగుతుంది. ఇంట్లో అల్లం పౌడర్ లేకపోతే కూరలలో మరియు టీ తో ముడి అల్లం వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

Tip-7: ఆహారాన్ని ఎక్కువసేపు నమలడం ద్వారా ఎక్కువ లాలాజలం విడుదలయ్యి అది ఆహారంతో కలిసి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇలా జరిగే క్రమంలో సంతృప్తి హార్మోను విడుదలయ్యి కడుపు నిండినట్లుగా మనస్సును హెచ్చరిస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

Tip-8: దాహం వేసినప్పుడు ఎక్కువగా వేడి నీటిని త్రాగండి. వేడి నీరు జీవక్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 30 నిమిషాలు పాటు కొంచెం వేగంగా వాకింగ్ చేస్తే పొట్ట చుట్టు ఉన్న కొవ్వు తొందరగా తరిగిపోతుంది.