కరోనాకు భయపడి థియేటర్స్‌కు జనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు కొద్ది రోజులుగా మూసే ఉంచాయి. పెద్దతెరపై వినోదం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ అనే మూవీతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో తేజ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు నభా నటేష్ అందాలు సత్య, రావు రమేష్, వెన్నెల కిషోర్, నరేష్‌ల నటన సినిమాని ఓ రేంజ్‌కు తీసుకెళ్ళాయి. తొలి రోజే ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో రానున్న రోజులలో ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం నైజాంలో 98 లక్షల కలెక్షన్స్ రాబట్టగా, సీడెడ్-52 లక్షలు, యూఏ- 40 లక్షలే, ఈస్ట్- 26 లక్షలు, వెస్ట్- 18 లక్షలు, గుంటూరు -22 లక్షలు, కృష్ణ- 13 లక్షలు, నెల్లూరు- 11 లక్షలు వచ్చాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని ఈ చిత్రం 3 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా 4 కోట్ల పైనే ఈ చిత్రం వసూళ్ళు రాబట్టినట్టు తెలుస్తుండగా, ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యుత్యమం అని చెబుతున్నారు.
ముఖ్య నగరాలన్నింటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం వలన కూడా కలెక్షన్స్ పై కొంత ఎఫెక్ట్ పడిందని నిర్మాతలు అంటున్నారు. రానున్న రోజులలో కలెక్షన్స్ పరిస్థితిని చూసి ఈ సనిమాకి ఎంత ఆదాయం వచ్చిందని అంచనాకు రావొచ్చిన అంటున్నారు. ఏదేమైన కరోనా కష్టకాలంలో ధైర్యంగా తమ సినిమాని విడుదల చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మెప్పు పొందిన సాయి తేజ్, దర్శకుడు సుబ్బు, నిర్మాతలు గ్రేట్ అనే చెప్పాలి. ఈ సినిమా స్పూర్తితో రానున్న రోజులలో చాలా సినిమాలు థియేటర్స్‌లోకి రానున్నాయి.