సాయి పల్లవి.. అందరి హీరోయిన్లది ఒక ట్రాక్ అయితే ఈమెది ఇంకో ట్రాక్. కమర్షియల్ సినిమా, స్టార్ హీరోయిన్ స్టేటస్ అనే పదాలకు ఈమె బాగా దూరం. అందరిలా కమర్షియల్ సినిమాల వైపు పరిగెత్తడం ఈమెకు రాదు. అందుకే అనేక అవకాశాలు ఒదులుకుంటోంది. ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ను బట్టి ఆమె పెద్ద సినిమాల్లో కనిపిస్తే ఇంకాస్త స్టార్ డమ్ తెచ్చుకోవడం ఖాయం. ఆమె క్రేజ్ ఆ సినిమాకు ఉపయోగపడుతుంది కూడ. అయితే కథాపరమైన సినిమాలు చేయడమే ఆమెకు ఇష్టం. చిన్నవైనా, మీడియం రేంజ్ సినిమాలైనా ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీమ్ సిగ్నల్ ఇస్తుంది. పాత్రకు అంత ఆస్కరం లేదు అంటే ఇట్టే నో చెప్పేస్తోంది.
ఇలాంటి కఠినమైన కండిషన్స్ ఉన్న సాయి పల్లవిని బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బెల్లంకొండ తెలుగు ‘ఛత్రపతి’ని హిందీలోకి రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. వివి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు వెర్షన్లో శ్రియ చేసిన పాత్రను హిందీలో సాయి పల్లవి చేత చేయించాలని అనుకుంటున్నారట. ఈ కథలో హీరోయిన్ పాత్రకు అంత భారీ ప్రాముఖ్యత ఏమీ ఉండదు. ఏదో కథలో అడపాదడపా కనిపిస్తుందే కథను తప్ప మలుపులు తిప్పదు. మరి ఇలాంటి పాత్రను సాయి పల్లవి చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆమె మీదనే ఆశలు పెట్టుకుంటే బెల్లంకొండ బృందానికి నిరాశ తప్పదు మరి.