Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. పుష్ప రాజ్ దాదాపు 1800 కోట్లతో దుమ్ము దులిపేశాడు. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 వంటి రికార్డులను సైతం బదులు కొట్టాడు అల్లు అర్జున్. ముఖ్యంగా బాలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ ను సాధించి అక్కడ కూడా రికార్డుల మోత మోగించాడు. అందుకే బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నారట.
పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ నుంచి ఇంకా డిస్కస్ చేసుకుంటూనే పుష్ప 2ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు బాలీవుడ్ జనాలు. అలా రిలీజ్ అయ్యిందో లేదో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే లెవల్లో కలెక్షన్లతో అదరగొడుతోంది పుష్ప 2. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 800 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపుతున్నారు బన్నీ. ప్రతి బాలీవుడ్ సినిమాని ఓవర్ టేక్ చేస్తూ హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది పుష్ప 2. అయితే పుష్ప రాజ్ సక్సెస్ కి క్రేజ్ కి ఫ్లాట్ అయిన బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ మీటింగ్స్ కూడా జరిపాడు. అయితే లేటెస్ట్ గా బన్నీతో బాలీవుడ్ అగ్ర ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
అంతేకాదు ఈ మధ్య పుష్ప 2తో బన్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో తెరకెక్కిన పఠాన్ సినిమా కలెక్షన్లని క్రాస్ చెయ్యడంతో బన్నీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది ఆ నిర్మాణ సంస్థ. దానికి బన్నీ కూడా ఈ రికార్డ్ ని యశ్ రాజ్ ఫిల్మ్స్ లోనే వస్తున్న మరో సినిమాతో బ్రేక్ చేద్దామంటూ రిప్లై ఇచ్చారు. దాంతో వీళ్లిద్దరూ కలిసి సినిమా చెయ్యబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్, బన్నీ కలిసి ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నారంటూ మరో చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమాకి కో ప్రొడ్యూసర్ గా యశ్ రాజ్ ఫిల్మ్స్ చేస్తుందన్న టాక్ నడుస్తోంది. మరో వైపు అట్లీ బన్నీతో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ షారూఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి హిట్ కొట్టిన అట్లీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. దాంతో అట్లీ-బన్నీ తో యశ్ రాజ్ మూవీ చేసే చాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ నిజంగానే బాలీవుడ్ సినిమా చేయబోతున్నారా అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.