బెల్లంకొండ రెండో వారసుడు అలా సెట్ చేసుకున్నాడు మరి

Bellamkonda Ganesh starts new project

Bellamkonda Ganesh starts new project

నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బాలీవుడ్లోకి కూడ వెళ్తున్నాడు. అక్కడ ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్నాడు. ఇక సురేష్ తన రెండో కుమారుడు గణేష్ ను కూడ హీరోగా పరిచయం చేస్తున్నాడు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు గణేష్ మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పవన్ సాధినేని దర్శకత్వంలో గణేష్ మొదటి సినిమా గతేడాది ఆరంభంలో మొదలైంది. కొంత షూటింగ్ జరిగాక లాక్ డౌన్ మూలంగా ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం మళ్ళీ మొదలుకాలేదు.

అదిగో ఇదిగో అంటూనే అటకెక్కించేశారు సినిమాను. దీంతో గణేష్ ఇంకో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఈసారి పక్కాగా ప్లాన్ చేశారట అతని ఎంట్రీని. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇది కంప్లీట్ లవ్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. షూటింగ్ కూడ కొంత భాగం పూర్తయిందట. అలా ఆరంభంలో తడబడిన బెల్లంకొండ వారసుడు ఎలాగో సర్దుకున్నాడు.