Bellamkonda Beauty : బెల్లంకొండ పాప మళ్లీ వస్తోందట.!

Bellamkonda Beauty : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘స్పీడున్నోడు’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందిగా. పేరు సోనారికా బడోరియా. తెలుగులో పెద్దగా సినిమాలేం చేసేయలేదు. కానీ, ఓ మోస్తరు క్రేజ్ వుందీ అమ్మడికి. ఆ మాటకొస్తే, ఇతర భాషల్లోనూ పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు.

హిందీలో ఓ సినిమా, తమిళంలో ఓ సినిమాతో సరిపెట్టుకుందంతే, తెలుగులో మాత్రం మూడు సినిమాల్లో నటించిందిలెండి. పెద్దగా హిస్టరీ లేని ఈ అమ్మడి ముచ్చట ఇప్పుడెందుకంటారా.? మళ్లీ తెలుగు తెరపై ఈ పాప సందడి మొదలవ్వబోతోందట.

ఈ మధ్య తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టు అమ్మడి చేతికి చిక్కిందట. ఆ సినిమాలో సోనారిక పాత్రకు ప్రేక్షకులు షాకవుతారట. అంత గొప్పగా ఆ పాత్ర వుండబోతోందట. ఇంతకీ ఏంటా సినిమా.? అంటే, అది మాత్రం ఇప్పటికి సస్పెన్స్ అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చింది.

గతంలో తెలుగులో తాను నటించిన హీరోల్లో ఒకరు అమ్మడికి ఆ ఛాన్స్ ఇచ్చారట. తెలుగులో పాప నటించింది మూడే మూడు సినిమాలు. అందులో ఒకటి ‘స్పీడున్నోడు’ బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కాగా, ఇంకో సినిమా ‘జాదూగాడు’. నాగశౌర్య హీరో. ముచ్చటగా మూడో సినిమా ‘ఆడో రకం ఈడో రకం’.

ఈ సినిమాలో సోనారిక మంచు విష్ణుకి జోడీగా నటించింది. పాప ఇచ్చిన హింట్ ప్రకారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరయ్యి వుండొచ్చేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.!