Bejawada Bebakka: సింగర్ మధు నెక్కంటి అంటే బహుశా ఎవరికీ గుర్తు రాదు కానీ బెజవాడ బేబక్క అంటే మాత్రం అందరికీ ఈమె టక్కున గుర్తుకు వస్తారు.. బెజవాడ బేబక్క విజయవాడకు చెందిన ఆమె అయినప్పటికీ అమెరికాలో స్థిరపడి అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండేవారు అయితే యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఫన్నీ వీడియోస్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ అవకాశం రావడంతో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న బేబక్క హౌస్ లో కేవలం ఒక వారం పాటు ఉన్న తన మాటతీరుతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. మొదటి వారమే హౌస్ నుంచి బయటకు రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బెజవాడ బేబక్క తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాదులోని కోకాపేటలో ఈమె ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. త్రీ బిహెచ్ కే ప్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తుంది. తాజాగా నూతన గృహప్రవేశ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు నటుడు శ్రీకాంత్ వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వేల మాధురి వంటి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంట్లో భాగంగా తన పిల్లికి ఆడుకోవడం కోసమే ఈమె ఏకంగా ఒక ప్రత్యేకమైన గోడను కూడా కట్టించడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది. ఇక సొంత ఇల్లు ఉండాలని ఎప్పటినుంచో తాను కోరుకుంటున్నానని, ఇన్నాళ్లకు నా సొంత ఇంటి కల నెరవేరింది అంటూ బేబక్క తెలియజేశారు.
