పరి పాలన సులభమయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటుకు రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చికల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రకియ పూర్తి చేయాలని సంకల్పించారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసేందుకు సమాయత్తం అవుతోంది యంత్రాంగం. అయితే ఈ కొత్త జిల్లాల వర్గీ కరణ రాష్ర్టంలో కొన్ని చోట్ల వివాదా స్పదం గా మారుతోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతల్లోనే పొరపొచ్చాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కొందరు టీడీపీ నేతలు తమకి అనుకూలంగాను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.
కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కి సొంత మామగారి నుంచి పెద్ద సవాల్ ఎదురైనట్లు తెలుస్తోంది. సొంత జిల్లా విజయనగరం జిల్లాల్లో పుష్ప శ్రీవాణి పై మామ ఎటాక్ ప్రారంభించినట్లు లీకులందుతున్నాయి. శత్రుచర్ల విజయరామరాజు -పుష్ఫ శ్రీవాణికి పెద మామ కాగా, సొంత మామ చంద్ర శేఖర్ రావు. ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడీయనే జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఆ కారణంగా నే పుష్ప శ్రీవాణి ఇన్నాళ్లు మౌనంగా ఉందన్న ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు మామ కోడలికి వ్యతిరేకంగా రాజకీయ పావులు కదుపుతున్నారుట.
అందుకు జిల్లాల ఏర్పాటే అస్ర్తంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. చంద్ర శేఖర్ రావు శిష్యుడు, టీడీపీ ఎమ్మెల్సీ ద్వారం పూడి జగదీష్ ని వైసీపీలోకి పంపించి పార్వతిపురం జిల్లాగా ఏర్పాటు చేసే ప్రపోజల్ పెట్టనున్నారుట. పార్వతిపురంను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నే ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నది ప్లాన్. ఇక పుష్ప శ్రీవాణి తన సొంత నియోజక వర్గమైన కురుపాంని జిల్లాగా చేయాలని జగన్ వద్ద పట్టుబడుతున్నారు. ఈ రెండింట నడుమ జగన్ ని ఇరకాటంలో పెట్టి కోడలిపై మామ పెత్తనం..పై చేయి సాధించాలన్నది స్కెచ్ గా కనిపిస్తోంది.