బండ్ల గణేష్ ఐసీయూలో ఉన్నాడా ?

Bandla Ganesh suffering with Covid 19

Bandla Ganesh suffering with Covid 19

నిర్మాత బండ్ల గణేష్ ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. నిత్యం పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంటూ ప్రేక్షకుల దృష్టిలో గట్టిగానే పడ్డారు. ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ గురించి గట్టిగానే మాట్లాడి విపరీతంగా వైరల్ అయ్యారు. ఆ వేడుకలో పవన్ మాటలకంటే కూడ బండ్ల గణేష్ మాటలే ఎక్కువ హైలెట్ అయ్యాయి. అలా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన బండ్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

బండ్లకు మరోసారి కరోనా సోకిందని, అస్వస్థతకు గురైన ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, ఐసీయూలో ఆయన చికిత్స తీసుకుంటున్నారని చెబుతున్నారు. బండ్లకు గతంలో కూడ వైరస్ సోకింది. ఆరంభంలో వైరస్ బారినపడిన టాలీవుడ్ సెలబ్రిటీల్లో బండ్ల మొదటి వ్యక్తి. మళ్ళీ సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడ ఆయనే మొదటగా వైరస్ బారినపడ్డారట. బండ్ల ప్రస్తుతం పవన్ ఆఫర్ ఇస్తే సినిమా చేయాలనే ఊపులో ఉన్నాడు. అందుకే నిత్యం పవన్ వెంట ఉంటూ చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకున్న బండ్ల త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.