షాకింగ్ : ఆమె మొహాన్ని కొట్టేసిన బండ్ల గణేష్..పోస్ట్ వైరల్

ఈరోజు అట్టహాసంగా చాలా ఆసక్తిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉండగా ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతు ఇచ్చిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా సెపరేట్ గా పోటీ చేస్తా అని షాక్ ఇచ్చారు. కానీ ఫైనల్ గా మళ్ళీ ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు.

అయితే వారి ప్యానల్ కి ఓట్ చెయ్యమని అడుగుతూ ప్రకాష్ రాజ్ ప్యానల్ పోస్టర్ ని పెట్టి పోస్ట్ చేశారు. అయితే ఇందులో మాత్రం తన మద్దతు ఒకామెకి ఉండదు అని ఆమెకి మాత్రం ఎవరూ ఓట్ చెయ్యొద్దని మాత్రం చాలా క్లియర్ గా చెప్పేసారు. ఆమెనే జీవిత రాజశేఖర్, ఇది అందరికీ తెలుసు. పోస్ట్ పెట్టి ఆమె ఒక్క ఫోటోని మాత్రం పెన్ తో కొట్టేసినట్టు చూపించకుండా పెట్టారు. దీనితో బండ్ల గణేష్ పెట్టిన ఈ షాకింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..