కొడుకు సినిమా ఈవెంట్ కు రాలేని పూరి.. ఇంకోసారి అలా చేయకు దండం పెడుతా అంటున్న బండ్ల!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ చోర్ బజార్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 24 న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా నిన్న రాత్రి ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రియులతో పాటు పరుశురామ్, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఇక ఈ సందర్భంగా బండ్ల గణేష్ పూరి భార్య గురించి పొగుడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. నిజానికి ఈ ఫంక్షన్ కు పూరి ముంబైలో ఉండడంతో రాలేకపోయాడు. దీంతో బండ్ల గణేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఒకవేళ ఇదే పరిస్థితిలో తను ఉండుంటే.. తన కొడుకు కోసం అన్ని పనులు మానుకొని వచ్చేవాడిని అంటూ.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దండం పెడతా.. ఎందుకంటే మనం ఏమి సంపాదించినా భార్య పిల్లల కోసమే.. అంటూ అంతేకాకుండా తన లాంటి వాళ్లని స్టార్ చేసి తన కొడుకుని స్టార్ట్ చేయకుండా ముంబై లో కూర్చుంటే ఒప్పుకోమని అన్నాడు.