Bandla Ganesh: నోరు అదుపులో పెట్టుకోవాలి… పృథ్వీ రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్!

Bandla Ganesh: విశ్వక్ హీరోగా నటించిన లైలా సినిమా వేడుకలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. పరోక్షంగా ఈయన వైసీపీ గత ఎన్నికలలో గెలిచిన సీట్ల గురించి విమర్శలు చేశారు. ఫస్ట్ లో 150 గొర్రెలు ఉండేవని ప్రస్తుతం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడారు. ఈయన సినిమాలో సన్నివేశం గురించి చెప్పిన ఇది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేశారని వైసీపీ అభమాను ఒక్కసారిగా లైలా సినిమాని టార్గెట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో హష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ సుమారు లక్షకు పైగా ట్వీట్లు చేశారు. ఇలా ఒక్కసారిగా ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ ట్వీట్లు చేయడంతో ఈ సినిమాపై పూర్తిస్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. ఇక ఈ నెగెటివిటీ సినిమాపై భారీ ప్రభావాన్ని చూపిస్తుందని భావించిన చిత్ర బృందం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు అతనికి మాకు ఏమాత్రం సంబంధం లేదని అలాగే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు పక్కన మేము లేము ఉంటే ఇలా మాట్లాడనివ్వము అంటూ చెప్పుకు వచ్చారు.

ఈ క్రమంలోనే హీరో విశ్వక్ ఏకంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ వివాదం పై పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ, నటులు సినిమా వేదికల పై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా మాత్రమే చూడండి అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.