Bandla Ganesh: తిరుపతికి పాదయాత్ర చేయబోతున్న బండ్ల గణేష్… పాదయాత్ర వెనుక కారణం అదేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు ఈయన సినీ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే నిర్మాతగా మంచి స్థాయిలో ఉన్న బండ్ల గణేష్ అనూహ్యంగా రాజకీయాల వైపు వెళ్లారు అయితే రాజకీయాలలో కూడా ఈయన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు ఇలా రాజకీయాలకు సినిమాలకు ప్రస్తుతం ఈయన దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలకు రాజకీయాలకు బండ్ల గణేష్ దూరంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సినీ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు.

ఇట్లా ఉండగా తాజాగా బండ్ల గణేష్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈయన నివాసం నుంచి తిరుపతికి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ పాదయాత్ర కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈయన నివాసం నుంచి తిరుపతికి సుమారు 500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇలా ఇంత దూరం బండ్ల గణేష్ పాదయాత్ర చేయడం వెనుక గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

బహుశా ఈయన త్వరలోనే తిరిగి రాజకీయాలలోకి అలాగే సినిమాల ద్వారా కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయాలలో మంచి సక్సెస్ అందుకోవడం కోసమే ఇలా తిరుపతికి పాదయాత్ర చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బండ్ల గణేష్ చేసే పోస్టులు ఆయన తీసుకుని నిర్ణయాలు అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. మరి ఈ పాదయాత్ర వెనుక గల కారణం ఏంటి అనేది తెలియాలి అంటే బండ్ల గణేష్ స్పందించాల్సి ఉంది.