Home News జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుంది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్?

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుంది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్?

బండి సంజయ్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని.. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేస్తూ విమర్శల పాలు అయిన సంగతి తెలిసిందే.

Bandi Sanjay Sensational Comments On Trs Govt
bandi sanjay sensational comments on trs govt

తాజాగా… టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి రెచ్చిపోయారు బండి సంజయ్. తెలంగాణలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయంటూ జోస్యం చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది. అవినీతి ప్రభుత్వం కూలుతుంది. కేంద్రం అన్ని లేక్కలు తేల్చుతుంది. అమిత్ షా కూడా వస్తున్నాడు. టీఆర్ఎస్ జాగ్రత్త.. అంటూ బండి సంజయ్ అన్నారు.

నేను ఇంట్లో చెప్పే వచ్చా.. నేను చావుకు బయపడను… కేసీఆర్ ఎందుకు భారత్ బయోటెక్ కు వెళ్లలేదు. ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా చెబుతా.. ఘాట్లను టచ్ చేస్తే దారుసలాంను కూల్చేస్తాం.. అంటూ సంజయ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Related Posts

Related Posts

Latest News