ఉద్యోగాలు లేవు.. గిద్యోగాలు లేవు.. అంతా డ్రామా.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్?

bandi sanjay fires on cm kcr

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని.. 50 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటించారు. దీంతో.. తెలంగాణ నిరుద్యోగులు ఎగిరి గంతేశారు. మా మంచి సీఎం.. అంటూ కేసీఆర్ ను ఆకాశానికెత్తారు.

bandi sanjay fires on cm kcr
bandi sanjay fires on cm kcr

అయితే.. కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులైతే.. సీఎం కేసీఆర్ ప్రకటన అంతా డ్రామా అంటూ తిప్పికొడుతున్నారు.

త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఆ ఎన్నికల్లో ఓట్లు వేసేది డిగ్రీ చేసిన వాళ్లు. అందులో చాలామంది నిరుద్యోగులు ఉంటారు. చాలా ఏళ్ల నుంచి నియామకాలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సడెన్ గా 50 వేల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు ఆశ చూపించేది కేవలం పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు పొందడానికే అంటూ బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ విమర్శించారు.

తెలంగాణ వచ్చి ఆరేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారు. ఇన్ని రోజులు కేసీఆర్ కు తెలంగాణ నిరుద్యోగులు గుర్తుకు రాలేదా? అంటూ సంజయ్ మండిపడ్డారు.

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. దానిపై బీజేపీ ఆందోళన నిర్వహిస్తుందని ముందే పసిగట్టిన కేసీఆర్.. బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదని.. ఇలా డ్రామాలు ఆడుతూ.. ప్రకటనలు చేశారని.. ఓట్ల కోసం ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు ఓటమి తప్పదని బండి సంజయ్ స్పష్టం చేశారు.