తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆర్.టి.సి ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని జేబీఎస్ బస్ స్టేషన్ వద్ద బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొని.. అక్కడి ప్రయాణికులతో, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు.
ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదలకు ఆర్టీసీ బస్సులు దిక్కు అని.. మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచారు అని.. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని.. అందుకే ఇలా ఛార్జీలు పెంచారు అని ఆయన విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పి ఆర్ సి లు, ఆరు డీఏలు కూడా ఇంక చెల్లించలేదు అని ఆయన మండిపడ్డారు.