తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డ బండి సంజయ్..

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పెద్ద సంఖ్యలో ఉన్న పేద ప్రజల రేషన్ కార్డులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం తో బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులను తొలగించడం సరైనది కాదని అన్నారు.

దీంతో ఆయన రేషన్ కార్డులు రద్దు, కొత్త కార్డులు మంజూరు కు సంబంధించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిందని అన్నారు. ఇక కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసిన వారిని పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయమని అన్నారు. అంతే కాకుండా కొత్త కార్డులను ఎందుకు మంజూరు చేయటం లేదు అని దర్యాప్తు చేయమన్నారు.