Balayya : చంద్ర ఘోష: బాలయ్యా ఇప్పుడెందుకు కెలికావయ్యా.?

Balayya :స్వర్గీయ నందమూరి తారకరామారావుని స్వయానా ఆయన అల్లుడు నారా చంద్రబాబునాయుడు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వైనం జగద్విదితం. అబ్బే, అది వెన్నుపోటు కాదు.. నాయకత్వ మార్పిడి.. అని చంద్రబాబు ‘తిమ్మిని బమ్మిని’ చేసే ప్రయత్నం చేసినా, రాజకీయాల్లో వెన్నపోటు అన్న మాట అనగానే చంద్రబాబు పేరే అందరికీ గుర్తుకొస్తుంటుంది.

తానెంతగా ఆ గాయాన్ని మర్చిపోవాలని చంద్రబాబు అనుకుంటున్నా, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఆ గాయాన్ని కెలుకుతూనే వుంటారు. ఈసారి గట్టిగా కెలికేసింది ఇంకెవరో కాదు స్వయానా చంద్రబాబు వియ్యంకుడు.. అదేనండీ చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ.

ఎవరైనా ‘వెన్నుపోటు’ అనంటే, నా కళ్ళ నుంచి నీళ్ళు సుడులుగా తిరిగేస్తుంటాయ్.. అని బాలయ్య ఏ ముహూర్తాన ఓ ఇంటర్వ్యూలో (తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కార్యక్రమంలోనే) చెప్పడంతో, బాలయ్య అభిమానులే షాక్‌కి గురయ్యారు.

నిజానికి, వెన్నుపోటు ఎపిసోడ్ గురించి బాలకృష్ణ మాట్లాడకపోవడమే చంద్రబాబుకి మంచిది. అన్నట్టు, బాలయ్యకి కూడా ఆ విషయంలో మౌనం దాల్చడమే మంచిది. కానీ, బాలయ్య ఈసారి గట్టిగా కెలికేశారు. అప్పట్లో సీనియర్ ఎన్టీవోడు.. అదేనండీ స్వర్గీయ నందమూరి తారకరామారావు ‘వెన్నుపోటు’ గురించిన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది.. బాలకృష్ణ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో.

నువ్వు తప్పు చెబుతున్నావా.? మీ నాన్న తప్పు చెబుతున్నారా.? అంటూ జనం నిలదీస్తున్నారు నందమూరి బాలకృష్ణని. బావే మంచోడు, మా నాన్నే మంచోడు కాదు.. అని బాలయ్య చెప్పదలచుకుంటున్నాడా.? లేదంటే, బావనే వెన్నుపోటు పొడిచేందుకు ఈ స్కెచ్ బాలయ్య వేశాడా.?

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles