మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాలయ్య బాబు.. ఇండియాలో నెంబర్ వన్ హీరోగా అలా..?

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ తెరపై ఏవిధంగా ఉంటారో తెరవెనుక కూడా అదే విధంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే బాలయ్యబాబు ని బాగా అర్థం చేసుకుని దగ్గర నుంచి చూసిన వాళ్ళు అయితే బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని అంటూ ఉంటారు. ఇకపోతే రికార్డులును బ్రేక్ చేయడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు రికార్డులు సాధించిన విషయం తెలిసిందే.

ఇకపోతే బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి దూసుకుపోయింది. ఈ సినిమాకు విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలు మేరకు విడుదలైన ఈ సినిమా కవిత వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇకపోతే ఈ రోజుల్లో కొత్త సినిమావరుసగా మూడు వారాలు ఆడింది అంటే అది ఒక చరిత్రగా చెప్పుకుంటున్నారు. అలాంటిది బాలయ్య నటించిన అఖండ సినిమా ఏకంగా 175 రోజులు థియేటర్లలో ఆడింది.

ఈ సినిమా విడుదల అయి 50 రోజులు పూర్తి అవుతున్నా కూడా 103 థియేటర్లలో ప్రదర్శించడం కూడా రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో. ప్రస్తుతం ఈ రికార్డు ఒక్క బాలయ్యకే సొంతం అయ్యింది. ఈ విషయంలో బాలయ్య ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అలాగే, ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. మొత్తానికి అఖండ థియేటర్స్ ఈలలు, గోలలతో దద్దరిల్లి పోయాయి.