సంక్రాంతికి విస్వరూపం చూపిస్తానంటున్న బాలకృష్ణ

తెలుగు సినిమా లు సంక్రాంతికి విడుదల చెయ్యడం అనేది ఒక ట్రెండ్. ఆ టైం లో ఎన్ని సినిమాలు వున్నా సరే, కొంత మంది హీరోలు సంక్రాంతికి తమ సినిమా ఒక్కటైనా రిలీజ్ అవ్వాలని అనుకుంటారు. సంక్రాంతికి తన కెరీర్ లో చాలా బ్లాక్బస్టర్ సినిమాలు ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఈ సారి ‘వీర సింహా రెడ్డి’ మూవీ తో రెడీ అవుతున్నాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ‘అఖండ’ హీరో తర్వాత వస్తున్నా ఈ సినిమా మీద అభిమానులకి అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, బాలయ్య అభిమానిగా సమరసింహా రెడ్డి మూవీ ఫస్ట్ డే చూసి జైల్లో ఒకరోజు గడిపిన ఆయన వీరాభిమానిగా ఈ సినిమాని ప్రాణం పెట్టి తెరకెక్కించాను.

ఈ మూవీలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలతో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే మంచి కంటెంట్ కూడా ఉంది. మీరు అనుకున్న దానికంటే వీర సింహా రెడ్డి మూవీ రెండింతలు పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు. ఇప్పటికే మూవీ దాదాపుగా పూర్తి కావచ్చిందని, కేవలం మరొక ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా వీర సింహా రెడ్డి సూపర్ హిట్ కొడుతుందని, ఆ విధంగా ఇందులో కావలసినంత స్టఫ్ ఉందని అన్నారు.

వీరసింహా రెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అంటూ సాగె ఇటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ మూవీలో ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు మూవీకి ఎంతో గొప్పగా డైలాగ్స్ రాసారని అన్నారు. సంక్రాంతికి రానున్న వీర సింహా రెడ్డి తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడం ఖాయం అని పూర్తి నమ్మకం తో చెప్పాడు.