డూప్ లేకుండా ఫ్లై ఓవర్ మీద నుంచి దూకిన హీరో బాలకృష్ణ.. చివరకు?

సాధారణంగా చాలామంది స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. సినిమాలలోని ఫైట్ సీన్లలో, రిస్కీ సీన్లలో నటించడానికి స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించారు. అయితే స్టార్ హీరో బాలకృష్ణ ఈ విషయంలో మాత్రం భిన్నంగా ఉంటారు. ఎంత రిస్కీ సీన్ అయినా ఆ సీన్ ను డూప్ లేకుండా సొంతంగా చేయడానికి బాలకృష్ణ ఇష్టపడతారు. పలు సందర్భాల్లో రిస్కీ సీన్లు చేయడం వల్ల బాలయ్యకు దెబ్బలు తగిలిన ఘటనలు సైతం ఉన్నాయి.

ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు. బాలయ్య హీరోగా నటించిన సినిమాలలో సీమసింహం సినిమా ఒకటి. ఈ సినిమాలో ఒక సీన్ కోసం బాలయ్య 40 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లై ఓవర్ నుంచి కిందికి దూకారు. అయితే అంత ఎత్తుపై నుంచి దూకినా బాలయ్యకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం. హైదరాబాద్ లోని నారాయణగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర ఈ సినిమా షూటింగ్ జరిగింది.

సాధారణంగా బాలయ్య హీరోగా తెరకెక్కి టైటిల్ లో సింహా ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే సీమ సింహం సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రిస్కీ సీన్లలో డూప్ ను పెడితే న్యాచురాలిటీ లోపిస్తుందని అందుకే డూప్ లేకుండా రిస్కీ సీన్లలో తాను నటించనని బాలయ్య వెల్లడించడం గమనార్హం. సినిమాపై బాలయ్యకు ఉన్న అంకిత భావాన్ని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.

స్టార్ హీరోలలో చాలామంది సెట్స్ లో షూట్ చేయడానికి ఇష్టపడతారు. అయితే బాలయ్య మాత్రం జనం మధ్యలో సినిమా షూటింగ్ లలో పాల్గొనడానికి ఇష్టపడతారు. బి.గోపాల్ శిష్యుడు రామ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సిమ్రాన్, రీమా సేన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం.