జూనియర్ ఎన్టీఆర్ మీద ఫైర్ అవుతున్న బాలకృష్ణ ఫ్యాన్స్.. కారణం ఇదేనా..?

నందమూరి కుటుంబం నుండి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వీరిద్దరికీ ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే వ్యక్తిగతంగా వీరి మధ్య చాలా గ్యాప్ ఉంది. గత కొంత కాలం నుండి వీరి మద్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే నందమూరి కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమంలోను జూనియర్ ఎన్టీఆర్ కనిపించటం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

టిడిపి పార్టీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే బాలకృష్ణ మాత్రం ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొని ఎమ్మెల్యేగా హిందూపురం నుండి రెండుసార్లు టిడిపి పార్టీ తరఫున గెలుపొందాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల నందమూరి తారక రామారావు 100 వ జయంతి ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో కూడా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి ఎక్కడ కనిపించలేదు. దీంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు మరింత బలపడ్డాయి.

ఇటీవల జూన్ పదవ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలకృష్ణకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేయకపోవడం పై బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. సొంత బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా సమయం లేదా అంటూ బాలకృష్ణ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోని సమర్థిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పక పోయినప్పటికీ పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు కదా అంటూ తన అభిమాన హీరోని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.