ఆమె కోసం బాలకృష్ణ, ఎన్టీఆర్ కలుస్తారా.. నమ్మేలా ఉందా ?

Balakrishna cannot join hands with NTR
Balakrishna cannot join hands with NTR
 
మా అసోషియేషన్ ఎన్నికలు కొత్త కొత్త సమీకరణాలకు చోటు ఇస్తున్నాయి. పోటీలో బలమైన వ్యక్తులు ఉన్నందు వలన పోటీ రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలోని పెద్ద తలలు కూడ ఈ ఎన్నికలను ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు భావిస్తున్నారని టాక్ నడుస్తోంది.
 
మొదటి నుండి మెగాస్టార్ చిరంజీవి మా ఎన్నికలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఆయన ఆశీస్సులు ఉన్నవారే అధ్యక్షులుగా నెగ్గుతూ వచ్చారు. చిరంజీవి ఇది చెబితే మెగా కాంపౌండ్ హీరోలంతా అదే ఫాలో అవుతారు. అందుకే చిరంజీవి మాటకు అంత బలం. ఈసారి ఆయన ప్రకాష్ రాజ్ వైపు నిలబడతారని టాక్. అందుకే ప్రకాష్ రాజ్ మిగతా అభ్యర్థులకంటే చాలా బలంగా కనబడుతున్నారు. 
 
ఇక ఈసారి ఎన్నికల్లో జీవిత పోటీ చేస్తోంది. ఈమెకు అసోసియేషన్ సభ్యల్లో కాస్త పేరున్న మాట నిజమే కానీ మరీ గెలిచేంత సామర్థ్యం అయితే లేదు. అందుకే ఈమెను గెలిపించడానికి నందమూరి బాలకృష్ణ మా ఎన్నికల్లో కలుగజేసుకుంటారని టాక్ నడుస్తోంది. మా సభ్యుల్లో నందమూరి బాలకృష్ణను అభిమానించే వర్గం కూడ ఉంది. 
 
బాలకృష్ణ నేరుగా మద్దతు ఇస్తాను అంటే వారంతా సహకారిస్తారు.  అయితే బాలకృష్ణ ఒక్కరే మెగా కాంపౌండ్ ప్రభావాన్ని ఢీకొట్టడం కుదరదు. మిగతా నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి రావాలి.  కానీ బాలకృష్ణ వారిని కలుపుకుంటారా అంటే అది జరగని పనే అనాలి.  మా ఎన్నికల కంటే ముఖ్యమైన చాలా వ్యవహారాల్లో ఎన్టీఆర్ అవసరం ఉన్నా కూడ బాలకృష్ణ కలుపుకోలేదు.
 
ఈమధ్య ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద కూడ ఆయన నర్మగర్భంగా బలమైన కామెంట్స్ వేశారు. వాటితో ఇద్దరి నడుమ దూరం మరింత పెరిగిందనే అనాలి. అలాంటిది మా ఎన్నికల కోసం చేతులు కలిపి తాను బలపరిచే అభ్యర్థికి మద్దతు ఇవ్వమని బాలకృష్ణ ఎన్టీఆర్ ను అడుగుతారా అంటే అది ముమ్మాటికీ నమ్మశక్యం కానీ విషయమే.