Balakrishna: ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. మరొకసారి అలాంటి పాత్రలో..?

Balakrishna: టాలీవుడ్ హీరో బాలకృష్ణ అఖండ సినిమా మంచి విజయం సాధించడంతో సినిమాల జోరు పెంచేశాడు. ఇక సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా అదే జోష్ తో బాలయ్య వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోని గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కిస్తుండగా, మరొక వైపు అనిల్ రావిపూడి సినిమాకు కూడా సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు మరొక సినిమా పట్టాలెక్కించే ప్రయత్నం లో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్య మరొకసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షోకీ హోస్ట్ గా వ్యవహరించిన అనుబంధంతోనే గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

తాజాగా దర్శకుడు విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. దర్శకుడు ఎవరో కాదు, మల్లిడి వశిస్ట్. హీరో కళ్యాణ్ రామ్ తో కలసి బింబిసార సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ కథ ప్రకారం చూసుకుంటే ఆ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అయితే రిటైర్మెంట్ కి ఆరునెలల సమయం ఉన్న పోలీసు పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. అలా చూపించడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ ఆరునెలల ప్రాంతంలో బాలకృష్ణ అక్కడ ఉన్న రౌడీలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ట్రాన్స్ఫర్ అవుతాడట.