Balakrishna: బాలకృష్ణను కాపాడటం కోసమే మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారా… అసలు విషయం చెప్పిన డాక్టర్?

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టినప్పటికీ బాలకృష్ణ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికి కూడా ఈయన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా నటన పరంగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు..

ఇలా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాలలోని ఎంతో బిజీగా గడుపుతున్న బాలకృష్ణకు సంబంధించి ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో బాలకృష్ణ తన ఇంట్లో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో భాగంగా ఓ ప్రముఖ నిర్మాత కూడా గాయపడినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే బాలకృష్ణ మానసిక స్థితి బాగా లేకనే కాల్పులు జరిపారని ఈ కాల్పులలో భాగంగా గాయపడ్డారు అంటూ నిమ్స్ ఆసుపత్రికి చెందిన ఒక మానసిక వైద్యుడు రిపోర్ట్స్ ఇచ్చారు.

తాజాగా డాక్టర్ కాకర్ల సుబ్బారావు బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆరోజు బాలకృష్ణను కాపాడటం కోసమే ఇలా మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారనే వార్త వినపడుతోంది ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించడంతో ఆరోజు బాలకృష్ణను కాపాడటానికి అది తప్ప మరో మార్గం లేదు అంటూ డాక్టర్ కాకర్ల సుబ్బారావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.