“బాహుబలి” నిర్మాతకి ఎదురైన అనుభవం..నార్త్ లో సౌత్ సినిమా ఎలా ఉంది?

Shobu Yarlagadda

Bahubali Producer : ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీ దగ్గర సౌత్ ఇండియన్ సినిమాల హవానే క్లియర్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాలు ఇంతలా వెళ్ళడానికి కారణం మాత్రం ప్రభాస్ మరియు రాజమౌళి లు తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ చిత్రం “బాహుబలి” సినిమాలే అని చెప్పాలి.

అయితే ఈ సినిమాని ఆర్కా మీడియా పతాకంపై నిర్మాత శోబు యార్లగడ్డ భారీ బడ్జెట్ వెచ్చించి సినిమా తీశారు. మరి తాను తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత ఇప్పుడు సౌత్ సినిమాలు హవా నార్త్ లో ఏ రేంజ్ లో ఉన్నాయో అనేది చెప్తూ రీసెంట్ గా తనకి ఎదురైన అనుభవం కోసం తెలిపారు.

తాను తాజాగా శ్రీనగర్ వెళ్లగా అక్కడ ఓ వ్యక్తిని జెనరల్ గా అడిగాను “మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి అని అడగ్గా అతను కేజీఎఫ్ 2, పుష్ప, బాహుబలి సినిమాలు అంటే నాకిష్టం” అని చెప్పాడని ఇలా సౌత్ ఇండియా సినిమాలు నార్త్ లో పాతుకొని పోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తనకి ఎదురైన అనుభవాన్ని బాహుబలి నిర్మాత పంచుకున్నారు. మొత్తానికి అయితే మన సినిమాలు ఓ రేంజ్ లో అక్కడ అదరగొడుతున్నాయని చెప్పాల్సిందే.