నాయకత్వ లక్షణాలు అనేవి అందరిలోనూ ఉండవు. అవి కొందరికే సొంతం. రాజకీయం అనే పద్మవ్యూహం లో నెట్టుకురావాలంటే చాలా మ్యాటరే ఉండాలి. ఎక్కడైనా నడిపించేది కేవలం ట్యాలెంట్ మాత్రమే. మా తాతలు నేతులు తాగారు..మా మూతులు వాసన చూడమన్నట్లు బిల్డప్ లు కొట్టే బాబాయ్ లు రాజకీయాలలో చాలా మందే ఉన్నారు. కానీ వర్తమాన రాజకీయాలలో అలాంటి కబుర్లు ఎందుకు పనికిరావు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అలియాస్ చినబాబు చంద్రబాబు వారసత్వంతో రాజకీయాలలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఆ యంగ్ పొలిటీషన్ పార్టీ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నదే.
2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి చినబాబు బెజవాడ బెంజి సర్కిల్ లో రాజకీయాలు చేసింది ఏనాడు. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పుడు మాత్రం హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకుని మూడు, నాలుగు రోజులు హడావుడి చేసి వెళ్లిపోయారు. రాజధానిలోని నిజమైన రైతులంతా రోడ్డున పడి రకరకాలుగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం నేటికీ చేస్తూనే ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం బావిలో కప్పలాగా బయటకు రావడం లేదు. కరోనాని సైతం లెక్క చేయకుండా కొంత మంది రైతులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా నిరసనలు తెలిపారు. మరి ఇలాంటి ప్రయత్నం చినబాబు ఏ రోజైనా చేసాడా? అంటే మచ్చుకి ఒక్కటి కూడా కనిపించదు.
మహానాడు నిర్వహించిన సమయంలో తమ కార్యాలయంలో మాత్రం నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. మీరు ఇలాగే నిరసనలు తెలపండి..మేము జామ్ యాప్ ల ద్వారా పుస్సింగ్ ఇస్తామని చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడది కూడా లేదు. ఎందకంటే జగన్ ఇప్పుడు అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిన చిట్టా సిద్దం చేయిస్తున్నారు కాబట్టి. దీంతో పెదబాబు-చినబాబు కూడా సైలెంట్ అయిపోయారు. కేవలం ట్విటర్లోనే చినబాబు టచ్ లో ఉంటున్నాడు. టీడీపీ లో తన ట్యాలెంట్ నిరుపించుకునే అవకాశం వచ్చినా చినబాబు వాడుకోవడం లేదు. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంతని ఆ పార్టీ అదిష్టానం అవకాశం ఇచ్చినా ఇప్పుడు పసుపు నేతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు.
మరో బ్రేకింగ్ ఏంటంటే? పెదబాబు కూడా అమరావతి పేరుతో ఏదో చేసాడని బలమైన కథనాలు వెలువడిన నేపథ్యంలో వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతే కానీ..అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్దికే తామంతా కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ట్యాలెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొస మెరుపుగా ప్రజలు కూడా తమని అర్ధం చేసుకోవాలని అనే మాట వరకూ చంద్రబాబు వచ్చారు. అంటే అమరావతి వెనుక అసల సంగతేంటో? సామాన్య ప్రజానీకానికి కూడా తెలిసినట్లే ఉంది.