bachpan ka pyaar boy: బచ్‌పన్ కా ప్యార్ బాలుడికి ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

bachpan ka pyaar boy: సహ్‌దేవ్‌ అంటే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ, జానీ మేరీ జానే మన్..బచ్‌పన్ కా ప్యార్ అనే పాటతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న సహ్‌దేవ్‌ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ బాలుడికి తాజాగా ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఆ బాలుడు తన తండ్రితో కలిసి బైక్ మీద సొంత ఊరు వెళ్తున్న సమయంలో బైకు అదుపు తప్పి కింద పడటంతో సహ్‌దేవ్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సహ్‌దేవ్‌ని మొదట సుక్మా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జగ్‌దల్‌పూర్‌ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు.

ఇక సహ్‌దేవ్‌ కు రోడ్డు ప్రమాదం జరిగింది అన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వినీత్ నందన్ వర్, ఎస్ పి సునీల్ శర్మ సహ్‌దేవ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం సహ్‌దేవ్‌ కి మెరుగైన చికిత్స అందించాలి అని చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ అధికారులను ఆదేశించారు. ఆ బాలుడి విషయంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు స్పందించిన సిఎంవో బాలుడికి మెరుగైన వైద్యం అందించాలి అనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సుక్మా జిల్లా కు చెందిన సహ్‌దేవ్‌ 2019లో తరగతి గదిలో జానీ మేరీ జానే మన్ పాట పాడిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియో ని తీసి టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో పై సెలబ్రిటీలు కూడా స్పందించి,సహ్‌దేవ్‌ ఫై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ప్రస్తుతం సహ్‌దేవ్‌ గురించి తెలిసిన ఆ పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ స్పందిస్తూ సహ్‌దేవ్‌ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని ట్వీట్ చేశారు. అనంతరం ఆ బాలుడి కుటుంబసభ్యులతో షారుక్ ఖాన్ మాట్లాడాడు.