తిరుపతి ఉప ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి దేశ వ్యాప్తంగా మొన్న జరిగిన ఉప ఎన్నికల సమయంలోనే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని అనుకున్నారు, కానీ ఎందుకో దానిపై నిర్ణయం తీసుకోలేదు, వచ్చే ఏడాది మొదటిలో ఆ ఎన్నిక ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ తమ తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి, అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి పేరు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.
గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మిని ఇక్కడ మరోసారి పోటీకి దించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి ఎన్నికల శంఖారావం ఊదాడు. అయితే చంద్రబాబు ఇంత త్వరగా అభ్యర్థిని ప్రకటించటం వెనుక బలమైన వ్యూహం ఉందని తెలుస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకుండా బీజేపీకి మద్దతు ఇవ్వబోతోందనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. బీజేపీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నా చంద్రబాబు తిరుపతిలో మద్దతు ఇచ్చి మోడీకి దగ్గర కావాలని చూశాడు. మోడీతో స్నేహం కోసం ఒక్క పార్లమెంట్ స్థానం పెద్ద సమస్య కాదని, పైగా అక్కడ టీడీపీ గెలిచే అవకాశం లేదని భావించిన బాబు బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అనుకున్నాడు.
అయితే దుబ్బాక ఎన్నికల ఫలితంతో బీజేపీకి ఎక్కడ లేని ఉత్సహం వచ్చింది. దీనితో తిరుపతిలో తమ సత్తా చాటాలని చూస్తున్నారు, ఇందులో భాగంగా ఈ మధ్య బీజేపీ నేతలు తిరుపతి పర్యటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారు, ఒక్క దుబ్బాక ఫలితంతో తెలంగాణలో కాంగ్రెస్ ను వెనక్కి నేటి రెండో స్థానంలోకి దూసుకొచ్చింది బీజేపీ. కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో తిరుపతిలో బీజేపీకి మద్దతు ఇస్తే ఇక తాము మూడో స్థానానికి పడిపోవటం ఖాయమని, పోటీచేసే సత్తా లేకనే బీజేపీకి మద్దతు ఇచ్చిందని అందరు అనుకుంటారు, బీజేపీ కూడా తామే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము అంటూ చెప్పుకునే అవకాశం లేకపోలేదు.
ఒక వేళా బీజేపీ కి మద్దతు ఇచ్చిన కానీ తర్వాత దానిని ఉపయోగించుకొని బీజేపీకి దగ్గర అవుతాం అనే నమ్మకం కూడా బాబుకు లేదు. ఎందుకంటే ఇప్పటికే బాబు రాజకీయాల గురించి మోడీకి బాగా తెలిచొచ్చింది, పైగా సోము వీర్రాజు లాంటి నేత ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ చీఫ్ గా ఉన్నాడు, సోము ఉండగా చంద్రబాబు బీజేపీకి దగ్గర కావటం జరిగేపని కాదు , కాబట్టి చూస్తూ చూస్తూ తమ స్థానం బీజేపీకి ఇచ్చినట్లు అవుతుందని బాబు బీజేపీకి మద్దతు అనే విషయాన్నీ పక్కన పెట్టేసి పోటీలోకి దిగాడు.
ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అనుగ్రహం కోసం ఎగబడుతున్నాడని, బీజేపీతో పొత్తు కోసం ఎలాంటి పనైనా చేయటానికి సిద్ధంగా వున్నాడని రాష్ట్రంలో క్రింది స్థాయి నేతలు కూడా అనుకుంటున్నారు, ఆ ముద్ర చెరిపేసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది, అందులో భాగంగానే ఎవరితో తమకు పొత్తు లేదని, అదే సమయంలో రాష్ట్రంలో తామే అసలైన వైసీపీ కి పోటీదారులమని నిరూపించుకోవటం కోసమే అందరి కంటే ముందుగా అభ్యర్థిని పోటీలోకి దించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు..