స్పెష‌ల్: బంతాడేస్తున్న బాహుబ‌లి మ‌నోహ‌రి ద‌బిడ దిబిడే అదే దంచుడు..

`బాహుబ‌లి : ది బిగినింగ్` చిత్రంలో మ‌నోహ‌రి పాట అంత బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డానికి కార‌ణం.. ఆ పాట‌లో ముగ్గురు భామ‌ల్లో నోరా ఫ‌తేహి హాట్ నృత్యాలే. ఈ భామ వేడెక్కించే భంగిమ‌ల‌తో పోల్ డ్యాన్స్ స‌ల్సాతో దుమారం రేపింది. ముగ్గురు భామ‌ల్లో ప్ర‌భాస్ తో రోమాంచితమైన స్టెప్పుల‌తో హీట్ పెంచింది.

baahubali fame nora fatehi instagram latest photos
baahubali fame nora fatehi instagram latest photos

నోరా గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ కే అంకిత‌మై అక్క‌డ కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లోనూ న‌టించేస్తోంది. ఇక ఉత్త‌రాది మోడ‌ల్ తో ప్రేమాయ‌ణంలోనూ ఈ అమ్మ‌డు య‌మ స్పీడ్ గా ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అదంతా స‌రే కానీ… నోరా సోష‌ల్ మీడియాల్లో అంతే స్పీడ్ గా ఉంటోంది. నోరా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది.

మ‌రోవైపు క్రైసిస్ తో సంబంధం లేకుండా కార్పొరెట్ కంపెనీల‌తో భారీ డీల్స్ కుదుర్చుకుంటూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తోంది ఈ బ్యూటీ. ఒక్కో డీల్ కి కోట్ల‌లో ఆర్జిస్తోంది. నోరా అంద‌చందాలు ఆయా బ్రాండ్ల‌కు జోరైన ప‌బ్లిసిటీని తెచ్చి పెడుతుంటే ఇక ఈ అమ్మ‌డు నాలుగు చేతులా సంపాదిస్తోంద‌ని స‌మాచారం. తాజాగా నోరా సొంత యూట్యూబ్ చానెల్ లో ప్ర‌క‌ట‌న షూటింగు విజువ‌ల్స్ ని రిలీజ్ చేసింది. ఇది యూత్ లో వైర‌ల్ గా మారింది.