Manchu Vishnu: బాల తిన్నడుగా మంచు అవ్రమ్… ఎమోషనల్ అయిన మంచు విష్ణు!

Manchu Vishnu: మంచు విష్ణు త్వరలోనే తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా గట్టిగానే నిర్వహిస్తూ సినిమాపై మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మంచు వారసులు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసి. ఇప్పటికే తన ఇద్దరు కుమార్తెలు కూడా ఈ సినిమాలో నటించగా తన కొడుకు మంచు అవ్రమ్ కూడా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.. ఇలా మంచు మూడోతరం వారసుడిగా అవ్రమ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇక మంచు అవ్రమ్ ఈ సినిమాలో విష్ణు చిన్నప్పటి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు తిన్నడుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అయితే తిన్నడు చిన్నప్పటి పాత్రలో అవ్రమ్ నటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో తిన్నడుగా  అవ్రమ్ తయారయ్యే వీడియోని విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. “కన్నప్ప సినిమా ద్వారా నా వారసుడు అవ్రమ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. వాడు సినిమా సెట్‌లోకి అడుగుపెట్టిన క్షణం, కెమెరా ముందు నిలబడిన తీరు, సంభాషణలు పలికిన విధానం.. ఇవన్నీ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని గొప్ప అనుభూతి అని తెలిపారు.

ఒక తండ్రిగా ఒకప్పుడు నేను కలలుగన్న ఈ సినిమా ప్రపంచంలోకి నా వారసుడు కూడా అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుందనీ తన కొడుకు సినీ ఎంట్రీ పై విష్ణు ఎమోషనల్ అయ్యారు ఈయన షేర్ చేసిన వీడియోలో తన కొడుకు బాల తిన్నడిగా రెడీ అవ్వడం షూటింగ్ లొకేషన్లోకి వచ్చే దర్శకుడికి అలాగే మోహన్ బాబు కాళ్లకు నమస్కరిస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తానికి కన్నప్ప సినిమా ద్వారా మంచు విష్ణు తన వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.