Avinash: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అవినాష్.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

Avinash:ముక్కు అవినాష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ అవకాశం రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చాడు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన అవినాష్ గతంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చివరికి తన వంతు సహాయం చేసే వారు ఎవరు లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను అంటూ తాజాగా ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో భాగంగా ఓంకార్ తో తన గతం గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అవినాష్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇలా ఎలాంటి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో స్టార్ మా తనని ఆదుకుందని అవినాష్ వెల్లడించారు.అయితే ఇది వరకే ఎన్నో సార్లు అవినాశ్ తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ పలుమార్లు ఈ విషయం గురించి వెల్లడించారు.తాజాగా తను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ దారుణంగా అవినాష్ ను కామెంట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావ్ అని చెబుతావు. మాటికీ ఈ సంఘటన గుర్తు చేసుకోవడం అవసరమా? ఇలా ప్రతి కార్యక్రమంలోనూ ఈ సంఘటన గురించి చెప్పడం వల్ల మీపై సానుభూతి కలుగుతుందనే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నారా అంటూ దారుణంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.