వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్ది కాలంగా సొంతపార్టీ పైన ఓవర్‌గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీలోనే మరో ప్రతిపక్షంగా మారిన ఎంపీ రాఘురామ్ సందు దొరికినప్పుడల్లా జగన్ సర్కార్ పై కామెంట్లు చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్న వైసీపీ నేతలు, ఇక కామ్‌గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో, తాజాగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాఘురామ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
అవంతి మాట్లాడుతూ.. అనవసరమైన విషయాల్లో జ్యోక్యం చేసుకోవద్దని రాఘురామ్‌ను హెచ్చిరించారు. జగన్ ఇమేజ్‌తో గెలిచి ఎంపీ పదవిని పొందిన రఘురామ్, తన ఇమేజ్‌తో గెలిచారనే ఊహల్లో ఉంటున్నారని, ఆయన గెలుపు జగన్ పెట్టిన భిక్ష అనే విషయాన్ని మర్చిపోయి, ఇప్పుడు సీయం జగన్ పైన విమర్శలు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. అసలు రాజధాని అమరావతిలోనే కొనసాగాలని చెప్పడానికి మీరెవరని అవంతి ప్రశ్నించారు.
ఇక రఘురామ కృష్ణంరాజు నర్సాపురం రాజకీయాల వరకే పరిమితమయితే బాగుంటుందని, తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ.. అనవసరంగా వేలు పెడితే కట్ చేయాల్సి వస్తుందని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పార్టీ విధానాలు నచ్చని నేపధ్యంలో రాజీనామా చేసి వెళ్లిపోవచ్చిని, ఆయన్ని ఆపేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, ఇష్టాను సారంగా మాట్లాడితే, చర్యలు తప్పవని, ఇకనైన నోటి దురుసుతనం తగ్గించుకోవాలని, రఘురామ్‌కు అవంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి అవంతి వ్యాఖ్యల పై రఘురామ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.