Crime News: దేశంలో రోజు రోజుకి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతోంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయటానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు అమలు చేసినా కూడా దుర్మార్గుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పాత కక్షలు, కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు ఎలా వివిధ రకాల కారణాల వల్ల చాలామంది ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ప్రాణాలు కోల్పోయింది ప్రమాదం వచ్చింది.
వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా,టెక్కలి మండలం పాతనౌపడ పంచాయతీ పరిధిలోని జండాపేట గ్రామానికి చెందిన తిప్పన జగదాంబ జెండాపేటలో నూతన ఇంటిని నిర్మించాలని భావించి ఇంటి నిర్మాణ పనులను కోటబొమ్మాళి మండలం ,తర్లిబొడ్డపాడు గ్రామానికి తాపిమేస్త్రీ విజయ్ కి అప్పగించింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం పెరగటంతో కొన్నాళ్లకు విజయ్ తనకు అప్పు కావాలని జగదాంబ ని కోరాడు. వారిద్దరి మధ్య ఉన్న పరిచయం వల్ల జగదాంబ విజయ్ నీ నమ్మి 6 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత తన అప్పు తీర్చమని జగదాంబ విజయ్ అని అడగగా అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ తరుణం హలో జగదీష్ అమ్మ విజయ్ గ్రామానికి వెళ్లి పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టి డబ్బు విషయంలో ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బుల కోసం జగదాంబ తనని నలుగురిలో నిలబెట్టి పరువు తీసిందని కక్షతో ఆమెని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు జగదాంబకు ఫోన్ అప్పు చెల్లిస్తానని చెప్పి రమ్మన్నాడు.జగదాంబ తన కుమార్తె యమునను తీసుకొని నౌపడ రైల్వే జంక్షన్ సమీపంలోని కొత్తచెరువు వద్దకు వెళ్లారు. విజయ్ తన స్కూటీపై ఇద్దరిని ఇజ్జువరం పాతరైల్వేట్రాక్ వద్దకు తీసుకువెళ్లాడు. వారిని అక్కడ దింపి మళ్లీ వస్తానని చెప్పి కాసేపటి తర్వాత తల్లి కూతుర్లు మీద ఇనుప రాడ్ తో దాడి చేశాడు. తలపై బలంగా దాడి చేయటంవల్ల ఇద్దరు స్పృహ కోల్పోయారు. వీరిద్దరిని గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. చర్చిలో ప్రాణాపాయం నుంచి ఇద్దరూ బయట పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.