Crime News: ప్రస్తుత కాలంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వారికి రక్షణ మాత్రం కరువైపోయింది. చిన్నా పెద్ద అనే భేదం లేకుండా వారి కామవాంఛలు తీర్చుకోవడానికి కొందరు కామాంధులు ఆడవారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలు ఇంటిని విడిచి బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు రాబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల ద్వారా ఎన్నుకోబడి, ప్రజల సంరక్షణ ను చూసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా నీచానికి పాల్పడుతుంటే సాధారణ జీవనం సాగిస్తున్న వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. తాజాగా నిర్మల్ జిల్లాలో బాలికపై అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టీఆర్‌ఎస్ నేత, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ బాలికపై అత్యాచారం చేశాడు. మైనర్ బాలికపై సాజిద్ ఖాన్ మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ బాధ భరించలేని బాలిక తల్లిదండ్రులతో విషయం చెప్పటం వల్ల వారు మొదట బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారుల సలహా మేరకు శనివారం రాత్రి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సాజిద్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో బాలిక లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిసింది. అందువల్ల సాజిద్ ఖాన్ పై పోక్సో చట్టం కింద అత్యాచార కేసు నమోదు చేశారు.
పోలీసులు సాజిద్ ఖాన్ పరారీలో ఉండటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఒక ప్రజా ప్రతినిధి,అధికార పార్టీ నేత
ఇలాంటి దారుణానికి పాల్పడటంతో ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఈ ఘటనపై డీఎస్సీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే నని, సామాన్యులకు రాజకీయ నాయకులకు అంతా ఒకే విధంగా న్యాయం చేస్తామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవటానికి నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.