హాస్పిటల్లో ఉన్న అచ్చెన్నాయుడుకి టెన్షన్.. టెన్షన్ 

Is Atchannaidu thinking about BJP
ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఈఎస్ఐకు సంబంధించి వైద్య పరికరాలు, మందులు, టెలి మెడిసిన్ సేవలపై ఈ-టెండర్లు నిర్వహించకుండానే రూ.975 కోట్ల కొనుగోళ్లు జరిపారని, అందుకుగాను అచ్చెన్నాయుడుకు కమీషన్లు అందాయనేది ఆరోపణ.  మొదటి నుండి ఈ కేసు మీద ప్రభుత్వం గట్టిగా ఉంది. జూన్ 12  తెల్లవారుఘామున ఇంటి గోడలు దూకి మరీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం, సర్జరీ నుండి కోలుకోకముందే ఆయన్ను వందల కిలోమీటర్ల దూరం వాహనాల్లో తిప్పి, జైళ్లలో ఉండచడంతో ఆయన అనారోగ్యం పాలయ్యారు.  కేసు బలంగా ఉండటంతో అచ్చెన్నాయుడుకి గతంలో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 
Atchannaidu
 
ఆతర్వాత ఎలాగో ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా అచ్చెన్నాయుడు కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కోర్టు అనుమతిచ్చింది.  ఈ ఒక్క అంశం మినహా కేసులో మిగతా విషయాలన్నీ ఆయనకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి.  ఏసీబీ అధికారులు, ప్రభుత్వం ఆయనకు ఊపిరి సలపనివ్వలేదు.  ఇవన్నీ చాలవన్నట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని తేలింది.  దీంతో ఆయన్ను మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఇలా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలతో సతమతమవుతున్న అచ్చెన్నాయుడుకు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే కొత్త టెన్షన్ పట్టుకుంది.  
 
తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.  ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. వచ్చే శుక్రవారం తీర్పు వెలువడనుంది.  అయితే అభియోగాల్లో ఉన్నట్టు అచ్చెన్నాయుడుకు కమీషన్లు అందినట్టు తెలియలేదని, బ్యాంకు లావాదేవీల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.  ఈ-టెండర్లు నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ.975 కోట్ల విలువైన కొనుగోళ్లు చేపట్టడంతో ప్రభుత్వ  ధనం సుమారు రూ.150 కోట్లు దుర్వినియోగమైందని, దీనిపై చార్జీషీటు దాఖలు చేస్తామని అన్నారు.  అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు దొరకని నేపథ్యంలో, కొత్త చార్జిషీటు దాఖలవుతున్న దరిమిలా తనకు బెయిల్ వస్తుందో రాదో అనే కంగారులో ఉన్నారు అచ్చెన్నాయుడు.