టీడీపీ కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చుట్టూ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థంకావట్లేదు. కీలకంగా భావించే పార్టీ అధ్యక్ష పదవి చేతిలోకి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నాననే భావం ఆయనలో గూడుకట్టుకుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్వేచ్ఛగా ఏది నచ్చితే అది చేసేవాడినని, ఒకరి అనుమతులు తీసుకోవాల్సిన పని ఉండేది కాదని ఫీలవుతున్నారట. అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి ఆయన చేతులు కట్టేసినట్టే ఉందట పరిస్థితి. అచ్చెన్నకు పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు నారా లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించినటు చెబుతున్నారు. అచ్చెన్న మొదటిలో నుండి డామినేటింగ్ ఫిగర్. ఎవరినైనా కనుమరుగు చేయగలరు.
అలాంటి వ్యక్తికి పదవి ఇస్తే పార్టీలో తన మనుగడ కష్టమవుతుందని, భవిష్యత్తులో అది ఇబ్బందికరమని భావించి ఆ పదవిని తనకు అనుకూలమైన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడికి ఇప్పించాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు లోకేష్ మాటలను వినలేదు. పదవిని అచ్చెన్నకే కట్టబెట్టారు. అయితే లోకేష్ బాబుకు మాత్రం పెద్ద రహస్యాన్ని బోధించారట అయన. అసంతృప్తితో ఉన్న అచ్చెన్నను శాంతింపజేసి పార్టీలో ఉండేలా చేయాలంటే పదవి ఇవ్వడం ఒక్కటే మార్గమని చెప్పి పదవి పేరుకు మాత్రమేనని, జరగాల్సినవి, చేయాల్సినవి మనమే చేస్తామని, పవర్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయని చెప్పారట.
ఆ ప్రకారమే లోకేష్ వేగం పెంచారు. తండ్రి నుండి అచ్చెన్నను ఎలా డామినేట్ చేయాలనే విషయమై బ్రీఫింగ్ తీసుకుని అడుగు బయటపెట్టారు. అందుకే ఆయన సహకారం లేకుండానే సొంతగా వరద బాధిత ప్రాంతల్లో రైతులను పరామర్శిస్తూ దూసుకుపోతున్నారు. దీంతో అందరి దృష్టీ లోకేష్ మీదే ఉంది. అచ్చెన్నను ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆయన వాయిస్ పూర్తిగా కట్ అయిపోయింది. ఈ సంగతి అచ్చెన్నకు కూడ తెలిసొచ్చింది. కానీ ఏమీ చేయలేక, ఇచ్చిన పదవిని కాదనలేక సర్దుకుపోతున్నారంతే.