Padma Award: కూతురిపై అత్యాచారం చేసిన పద్మ అవార్డు గ్రహీత.. ఎక్కడో తెలుసా?

Padma Award: అస్సాంకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, పేద పిల్లల కోసం ఆశ్రమం నడిపిస్తూ, చిన్నపిల్లల సంరక్షకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అతడికి దేశ విదేశాల నుంచి ఎన్నో అవార్డులు,రివార్డులు కూడా దక్కాయి. పేద పిల్లల కోసం భార్య తోడుగా ఆశ్రమం నడిపిస్తున్న ఆ వ్యక్తిలోని మరొక కోణం వెలుగులోకి వచ్చింది. అనాథ పిల్లల పాలిట తండ్రిగా పేరుపొందిన పద్మ అవార్డు గ్రహీత అత్యాచారం కేసులో ఇరుక్కుంటాడు. ఆశ్రమంలో పెంచుకునే పిల్లలను దత్తత తీసుకునే అతను.. చిన్న పిల్ల అనే కనికరం లేకుండా దత్తత తీసుకున్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించగా ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి అస్సాం పోలీసులు వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ కేంద్రాల నుంచి కొందరు బాలికలను అతను దత్తత తీసుకుని సాకుతున్నాడు. ఇక నిబంధనల ప్రకారం ఏడాది దత్తత గడువు ముగిసిన తర్వాత ప్రతిసారి రెన్యువల్ చేయించుకుని పిల్లలను మళ్లీ తన వద్దే ఉంచుకున్నాడు. కానీ ఒక బాలిక విషయంలో మాత్రం అయినా మరొకలా ప్రవర్తించాడు. దత్తత గడువు ముగిసిన తర్వాత ఆ బాలికను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే విషయంపై శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆరాతీయగా అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పద్మ అవార్డు గ్రహీత ఆ బాలికపై ఏడాది పాటుగా పలు సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ బాలిక అధికారులకు వెల్లడించింది.

ఇక ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగిన టెస్టులో నిర్ధారణ అయింది. ఈ విషయంపై గత ఏడాది డిసెంబర్ 17న పోలీసులు కేసు నమోదు చేయగా, పెంచుకున్న బాలికపై అత్యాచారం చేశాను అన్న ఆరోపణలు పచ్చి అబద్ధం అంటూ పద్మ అవార్డు గ్రహీత వాదించాడు. తన పరువుకు భంగం కలిగించే విధంగా కొంతమంది కావాలనే ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ అతను గుహ వాటి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు అతని పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి అంటూ వ్యాఖ్యానించింది. ఇక సంక్షేమ అధికారులు పోలీసులు ఫైల్ చేసిన రిపోర్టు లలో పొరపాటును గుర్తిస్తూ నిందితుడికి ముందస్తు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ డిసెంబర్ 28న కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ ఏడాది జనవరికి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈ గడువులోగా నిందితుడు పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని షరతులు విధించింది. అయితే మెడికల్ రిపోర్టు లో అత్యాచారం జరిగినట్లు స్పష్టంగా నిర్ధారణ అయినప్పటికీ అతను మాత్రం తన తప్పు చేయలేదు అంటూ బుకా ఇస్తున్నాడు. అయితే ఇలాంటి దారుణానికి ఆ పెద్ద మనిషి పేరు మాత్రం పోలీసులు వెల్లడించలేదు.