Devotional Tips: అమ్మవారి శేష వస్త్రాలు ధరిస్తున్నారా…ఈ నియమాలు పాటించాల్సిందే!

Devotional Tips: భారత దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినా ప్రతి చోట కూడా ఏదోక అమ్మవారి దేవాలయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఏ దేవుడి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా అమ్మవారి దర్శనం మాత్రం మనం ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాం. శక్తి పీఠాలుగా, ఆదిపరాశక్తిగా, కొలువై భక్తులు మనస్ఫూర్తిగా కోరిన కోరికలను నెరవేరుస్తూ వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

అయితే అమ్మవారికి జరిగే పూజలు మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలంకరణతో నిండిన అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. మనం అమ్మవారి దేవాలయంకి వెళ్లేటప్పుడు పసుపు, కుంకుమ, గాజులు, చీర, పువ్వులను అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తాము. ఈ విధంగా అమ్మవారికి సమర్పించినటువంటి చీరను దేవాలయం అర్చకులు వేలం వేస్తూ ఉంటారు. అమ్మవారి చల్లని చూపు పడినటువంటి ఈ చీరలను కొనటానికి భక్తులు ఎంతో ఉత్సాహానికిలోనై చీరలను తమ సొంతం చేసుకోవాలని ముందుకు వస్తారు.

అలాంటి అమ్మ వారి శేష వస్త్రాలు ఏలాంటి నియమాలు లేకుండా ధరించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.పండితులు చెబుతున్న దాని ప్రకారం స్త్రీలు అమ్మ వారి శేష వస్త్రాలు ను సొంతం చేసుకున్న తర్వాత మంచి ముహూర్తం, మంచి రోజు చూసుకొని ధరించడం ఉత్తమం. ముఖ్యంగా శుక్రవారం రోజున ధరిస్తే ఇంకా మంచిది.

అమ్మ వారి శేష వస్త్రాలు ఉదయం వేళలో ధరించడం మంచిదని, సాయంత్రం సమయంలో కాని, రాత్రి సమయంలో కాని ధరించడం మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు. ఇలాంటి నియమాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.అమ్మవారికి చీరలు కేవలం ప్రసిద్ధి చెందిన ఆలయాల నుంచి మాత్రమే కాకుండా గ్రామాలలో అమ్మవారికి సమర్పించిన చీరలను తీసుకున్న సరే మనకు ఒకటే ఫలితం దక్కుతుందని. అమ్మవారికి సంబంధించిన శేష వస్త్రాలను ఎక్కడ తీసుకున్నా సరే ఈ నియమాలను పాటించడం మంచిది.