Vastu Tips: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా..ఈ వస్తువులు ఇంట్లో పెడితే చాలు డబ్బే డబ్బు!

Vastu Tips:సాధారణంగా మన ఇంట్లో ఏదైనా వాస్తు లోపాలు ఉన్నప్పుడు మన కుటుంబం ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంది. ఇలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యల బారిన పడటం, మానసిక ఆందోళనలు వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ విధంగా అనేక సమస్యలతో సతమతమయ్యేవారు మన ఇంట్లో ఈ వస్తువులు పెడితే వాస్తు దోషాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు శనివారం లేదో సోమవారం ఒక కుండలో 3 శంకు పుష్పాలను వేయాలి. ఇలా మూడు వారాలపాటు చేయటం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విండ్ చైన్ ఇంట్లో వేలాడదీయడం వల్ల గాలి వల్ల దాని నుంచి వెలువడే ధ్వని ఇంటిలో ఉన్న ప్రతికూల పరిస్థితులను పారద్రోలుతుంది. అంతే కాకుండా మన ఇంటి నిర్మాణంలో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిస్తుంది.

వాస్తు గ్రంధాలలో ఎంతో పవిత్రమైనదిగా భావించే వాటిలో గుర్రపు నాడ ఒకటి. గుర్రపు నాడ ఇంటి ప్రధాన ద్వారం మధ్యలో వేలాడదీయడం వల్ల ఆ ఇంటిలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి ఉత్తరం దిశవైపు క్రాసులా మొక్క పెట్టడం ఎంతో మంచిది. ఇది ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం కొదువ ఉండదు. ఈ వస్తువులను ఇంటిలో కనుక ఉంచుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి సమస్యలు ఉండవు.