ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపులకు ఎవరైనా పుల్లకించిపోవాల్సిందే. ఎందుకంటే జగనన్న అంత ఆప్యాయంగా పలకరిస్తారు కాబట్టి. వయసుతో సంబంధం లేకుండా..తన మన అనే బేధం లేకుండా రాయలసీమ సంప్రదాయంలో అన్న అని ప్రేమగా పిలవడం ఆ ప్రాంతం వాసులకే చెల్లింది. నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి అయ్యా, అక్క, చెల్లమ్మలంటూ ఎంత ఆప్యాయంగా సంబోధించేవారో! తండ్రి వారసత్వాన్ని పుణకి పుచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి పెద్దాయన దారిలో వెళ్తున్నారు అనడానికి చాలా సందర్భాల్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు..ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నారు.
ఎవరు కనిపించినా అన్నా అని ఆప్యాయంగా పిలవడం జగన్ కు చిన్ననాటినే తల్లి విజయమ్మ నేర్పించారా..తండ్రి ఆదేశించారో గానీ అన్న అనే పదం జగనన్నగా మారిపోయిందంటే? అన్నా అనే పదానికి జగన్ ఎంత వెయిట్ ఇస్తారు! అనడానికి అద్ధం పడుతోంది మరో సన్నివేశం. ఆ మధ్య చిరంజీవి ని అన్నా అని సంబోధించారు జగన్. ఆ పదాన్ని గుర్తు చేసుకుని చిరంజీవి జగన్ నన్ను `అన్నా` అన్నారు అంటూ ఓ వీడియోనే చేసి రిలీజ్ చేసారు. అంటే ఆ పిలుపుని ఓ టాప్ స్టార్ ఎంత ఆస్వాదించారో అర్ధమవుతోంది. వయసులో చిరంజీవి -జగన్ కన్నా పెద్దోడే. ఇద్దరి మధ్య 16 ఏళ్య వ్యత్యాసం ఉంటుంది.
కానీ జగన్ ఉన్నత సీఎం పదవిలో ఉండగా `అన్నా` అని పిలవడం అంటే? సంచలనమే కదా. తాజాగా ఏపీ క్యాబినేట్ లో అలాంటి సన్నివేశమే ఒకటి చోటు చేసుకుంది.కరోనా నుంచి కోలుకుని మంత్రి వర్గ సమావేశానికి హాజరైన మంత్రి బాలినేని శ్రీనివాస్ తారసపడితే ఏం శీనన్నా బాగున్నావా? అని పలకరించారుట జగన్. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కూడా కనిపించగానే నవాబ్ సాబ్ ఎలా ఉన్నారు? కరోనా నుంచి కోలుకున్నారా? అంత కుశలమా? అని జగన్ ఆప్యాయంగా సంభాషించారుట. అందుకే కదా జగన్ ని వయసుతో సంబంధం లేకుండా అంతా జగనన్నా! అని ఆప్యాయంగా స్మరించుకుంటారు.