సోదరులకు రాఖీ కట్టే సమయంలో అలంకరణ ప్లేటులో ఇవి తప్పనిసరి?

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఇలా ప్రతి ఏడాది శ్రావణ మాస పౌర్ణమి రోజు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున సోదరీమణులు తమ సోదరులు ఎక్కడ ఉన్నా కానీ రాఖీ కట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి జీవితంలో ఎంతో సుఖసంతోషాలతో ఉండాలని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటారు.అదేవిధంగా తమ సోదరులు తమకు అండగా నిలబడాలని అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లకు ప్రతీకగా ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అయితే రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టే సమయంలో మనం అలంకరించుకునే ప్లేట్లులో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలి. అయితే రాఖీ అలంకరణ ప్లేటులో ఏ విధమైనటువంటి వస్తువులు ఉండాలి అనే విషయానికి వస్తే.. మనం పూజ చేసిన అనంతరం మన సోదరులకు కట్టే రాఖిని పూజ గదిలో ఉంచాలి. అనంతరం ఆ ప్లేటును అలంకరించుకొని సోదరులకు రాఖీ కట్టాలి. ముందుగా దేవుని వద్ద ఉంచిన రాఖీలు అక్షింతలు కుంకుమ ఏదైనా స్వీట్ తో ప్లేటును అలంకరించాలి.

వీటితోపాటు హారతి ఇవ్వడానికి దీపం కూడా వెలిగించుకోవాలి. మన సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి రాఖీ కట్టిన అనంతరం వారికి స్వీట్ తినిపించే హారతి ఇవ్వాలి. అలాగే మనకన్నా సోదరులు పెద్దవాళ్ళు అయితే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా రాఖీ పౌర్ణమి రోజు సోదరులకు రాఖీ కట్టాలి అయితే ఈ వస్తువులు అలంకరణ ప్లేటులో లేకపోతే అది అసంపూర్ణం అని చెప్పాలి. సోదరులు మనకన్నా పెద్దవాళ్ళు అయితే వారితో ఆశీర్వాదం తీసుకోవాలి లేదా మనకన్నా చిన్నవారైతే వారిపై అక్షింతలు వేసి ఆశీర్వదించాలి.