Khammam Constable Suicide: ఖమ్మంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా ఇంతలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కానిస్టేబుల్ ఇందులో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకు మరణవార్త విన్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
ఖమ్మంలోని సత్తుపల్లి నియోజకవర్గం లోని యజ్ఞ నారాయణ పురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి 2020లో ఖమ్మం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కొత్తగూడెం స్పెషల్ పార్టీ టీమ్ లో పని చేశారు. అనంతరం పోలీసు శాఖ బదిలీల్లో భాగంగా ఇటీవల ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. అయితే మరికొన్ని గంటల్లో అతని నిశ్చితార్థం స్వగ్రామంలో జరగాల్సి ఉంది. ఇక ఈ నెల 8వ తేదీన ఖమ్మం వచ్చిన అశోక్ కుమార్ సమీపంలోని ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని బస చేశాడు. మరుసటి రోజు ఉదయం రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది అశోక్ బసచేసిన రూమ్ తలుపు కొట్టగా అశోక్ తలుపు తీయడం లేదు.
ఇంతలో క్లీనింగ్ సిబ్బంది మేనేజర్ కు చెప్పారు. ఇక మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చి రూము తలుపులు వచ్చి రూమ్ తలుపులు కొట్టినా కూడా అశోక్ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అశోక్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఇక వెంటనే పోలీసులు అతని కుటుంబానికి సమాచారం అందించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఇలా పాడే ఎక్కడంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరొకవైపు కుటుంబ సభ్యులు అశోక్ నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అశోక్ మరణవార్తతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే అశోక్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.