ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమయింది. ఏపీ ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినట్టే లెక్క. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ కు టీడీపీ నేతలు కొన్ని సూచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఏపీ గ్రామ వాలంటీర్లను దూరం పెట్టాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.
ఇప్పటికే ఏపీలో వైసీపీ గ్రామ వాలంటీర్ల పేరుతో ఎన్నో అక్రమాలకు తెరలేపిందని… స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ గ్రామ వాలంటీర్లను తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకొని.. ఎన్నికల్లో గెలవడం కోసం అక్రమాలకు తెర లేపబోతున్నారని.. అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లను పక్కన పెట్టాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.
ఈసందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. గత ఎన్నికల్లోనూ వైసీపీ నాయకులు.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని… మళ్లీ అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే చాన్స్ ఉందని… ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. గ్రామ వాలంటీర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేస్తారో? దూరం పెడతారో?