తెలుగు రాష్ర్టాల మధ్య మరో కొత్త యుద్ధం మొదలైందా? వాటర్ వార్ పూర్తికాక ముందే ఇసుక యుద్దం మొదలైందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కు తరలించడం అన్యామంటూ తెలంగాణ ఆరోపించడం..దాన్ని ఏపీ ప్రభుత్వం ఖండిచడంతో ఇరు రాష్ర్టాల మధ్య సీన్ వేడెక్కింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కృష్ణా బోర్డ్ ఫరదిలోఉంది. అక్కడ పంచాయితీ తెలకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా మా నీళ్లు మేము తెచ్చుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కూడా కాదు. అయితే ఈవార్ వేడిలో ఉండగానే తెలుగు రాష్ర్టాలో కొత్త యుద్ధం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ర్టాల మధ్య ఈసారి ఇసుక వార్ మొదలైంది. తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై అంతరాష్ర్ర్ట సరిహద్దు అంశంలో వివాదం చెలరేగింది. సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి గాను ఏపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీంతో కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు ఆ జిల్లాలోని శ్రావణ బెలగోళ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తరలించడానికి వాహనాలు పంపారు. అక్కడే ఏపీ ఇసుక రీచ్ ను కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఇటువైపు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న దువ్వాడ గ్రామస్థులు దీనిపై ఆందోళ చేశారు. తమ గ్రామ పరిధిలోకి వచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఏపీ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ విషయం ఏపీ అధికారులకు తెలియడంతో తెలంగాణ అధికారులో మాట్లాడారు. అయినా తెలంగాణ అధికారులు వాహనాలు వెనక్కి పంపిచడానికి ఒప్పుకోలేదు. దీంతో ఏపీ-తెలంగాణ మధ్య ఇసుక యుద్దం మొదలైందన్న వార్త మీడియాని వేడెక్కిస్తోంది.