AP: కడపలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్…21తో గేమ్ ఛేంజర్ అవ్వలేరంటూ పోస్టర్స్?

AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కడపలో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కడప పర్యటనలో భాగంగా ఈయన కడపకు వెళ్లి అక్కడ వైసిపి నేతల గురించి మాట్లాడుతూ వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈయన కడపలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలోనే కడపలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రెండు పోస్టర్లను కట్టారు. దీంతో పోస్టర్ వార్ నెలకొంది.

స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వెలిశాయి ఫ్లెక్సీలు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కలాం గారు మనకు వచ్చే కలలు నెరవేర్చుకోవడం కోసం కష్టపడమని చెప్పారు కానీ వేరే వారికి వచ్చే కలలు కోసం కష్టపడమని కాదంటూ పోస్టర్ వేశారు. మేము అప్పుడే చెప్పం ఆయనతో వ్యవహారం అంత ఈజీ కాదని 21 సరిపోవు 50 తీసుకోమని మేము చెప్పాము కానీ మీరు వినలేదు.

21 తో గేమ్ చేంజర్ కాలేము అన్నా అని చెప్పిన వినలేదు ఇప్పుడు పరిస్థితి ఆ సినిమాలాగే అయింది. వాళ్లు మనకున్నది 21 సీట్లే అనుకుంటున్నారు కానీ వారికి ఆ కుర్చీ మనం పెట్టిన భిక్ష అని మర్చిపోయారు అంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశిస్తూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అయితే అది ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

వైయస్సార్సీపీ కార్యకర్త దేనికైనా ఎవరికైనా భయపడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలవాలి కానీ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం సరైనది కాదని కట్ట కాలే వరకు పార్టీకి, అన్నకు అండగా ఉండే సగటు కార్యకర్త అంటూ మరో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతున్నాయి అలాగే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.