AP: ఇటీవల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎవరిని కేటాయిస్తారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది .అయితే పొత్తులో భాగంగా ఒకటి జనసేన పార్టీకి మరొకటి బిజెపికి వెళ్ళగా మిగిలిన మూడు ఖాళీలు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఠాపురం వర్మకు చోటు దక్కుతుందని అందరూ భావించారు ఆయన కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ తన ఆశలు కాస్త ఆడి ఆశలుగా మారిపోయాయి.
పిఠాపురం వర్మకు మరోసారి చంద్రబాబు నాయుడు మొండిచేతులు చూపించారు దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో వర్మ మొదటిసారి తనకు ఎమ్మెల్సీ రాకపోవడం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా వర్మా మాట్లాడుతూ నిజానికి తాను ఈరోజు హైదరాబాద్ వెళ్లాల్సి ఉండేది కానీ రాత్రి మీరందరూ ఫోన్లు చేయడంతోనే నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నానని తెలిపారు. ఇక ఎమ్మెల్సీ రాకపోవడం గురించి ఈయన మాట్లాడుతూ.. తాను గత 23 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తున్నాను. అయితే ఎప్పుడూ కూడా చంద్రబాబు గారి నిర్ణయానికి తాను వ్యతిరేకం కాలేదు ఇప్పుడు కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.
చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాను ఇకపై కూడా కష్టపడతానని అయితే తన కార్యకర్తలు జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఒప్పుకోనని వర్మ తెలిపారు. ఇక 23 సంవత్సరాల క్రితమే నాకు ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు అదే నాకు తను ఇచ్చే గొప్ప పదవి అంటూ వర్మ చంద్రబాబు నిర్ణయం పై సానుకూలంగా స్పందిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.